మద్దలకట్ట ZPH స్కూల్లో నూతన SMC కమిటీ బాధ్యతల స్వీకారం

3చూసినవారు
మద్దలకట్ట ZPH స్కూల్లో నూతన SMC కమిటీ బాధ్యతల స్వీకారం
పెద్దారవీడు మండలంలోని మద్దలకట్ట ZPHS హైస్కూల్ పాఠశాల నిర్వహణ కమిటీ (SMC) చైర్మన్‌గా జడ్డా దానియాలు, వైస్ చైర్మన్‌గా యర్రగొండ కాశమ్మ ఎన్నికయ్యారు. అనంతరం నూతన చైర్మన్, వైస్ చైర్మన్‌లు పదవీ బాధ్యతలు స్వీకరిస్తూ ప్రమాణ స్వీకారం చేశారు. యర్రగొండపాలెం శాసన సభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు నూతన SMC కమిటీ ఏర్పాటైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో మద్దలకట్ట పంచాయతీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతన SMC చైర్మన్ జడ్డా దానియాలు, వైస్ చైర్మన్ యర్రగొండ కాశమ్మలకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్