వెలిగొండ ప్రాజెక్టులో ఎటువంటి ప్రమాదం జరగలేదు

12చూసినవారు
దోర్నాలలోని వెలుగొండ ప్రాజెక్టులో ఎటువంటి ప్రమాదం జరగలేదని ఈఈ కృష్ణారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండవ సొరంగంలో పెచ్చులు ఊడి పడి పనులు నిలిచిపోయాయని వస్తున్న వార్తలు అవాస్తవమని ఆయన అన్నారు. ఆగస్టు 2న పనులు జరుగుతున్నప్పుడు పెచ్చులు ఊడి పడటం వాస్తవమేనని, అయితే ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. 2026 జూలై నాటికి ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని ఆయన తెలిపారు.