మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం రామాయపాలెంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో గొల్ల రాజారావు, మురారి వెంకటయ్యకు చెందిన గడ్డివాములు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో రైతు గడ్డివాము కాలిపోవడం వల్ల సుమారు రూ. 50 వేల మేర ఆర్థికంగా నష్టపోయినట్లు తెలిపారు.