సాయిబాబా భక్తురాలు గ్రంథాలయానికి ర్యాక్ బహుకరణ

3357చూసినవారు
సాయిబాబా భక్తురాలు గ్రంథాలయానికి ర్యాక్ బహుకరణ
గుంటూరుకు చెందిన సాయిబాబా భక్తురాలు ఉమామహేశ్వరి, ఉమ్మడి ప్రకాశం జిల్లా త్రిపురాంతకం శాఖా గ్రంథాలయానికి పుస్తకాలు భద్రపరిచే ర్యాక్ ను బహుమతిగా అందజేశారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో, ఆమె పుస్తక ప్రియులకు తన వంతు సహకారం అందించారు. గ్రంథాలయ అభివృద్ధి, పఠన సంస్కృతి పెంపొందించేందుకు ఆమె చేసిన ఈ సేవ అభినందనీయమని గ్రంథపాలకుడు జి. రామాంజి నాయక్, సాహితీవేత్త గొట్టిముక్కుల నాసరయ్య పేర్కొన్నారు. భక్తితో పాటు సమాజ సేవ పట్ల అంకితభావంతో ముందుకు సాగుతున్న ఉమామహేశ్వరి సేవా స్ఫూర్తి ఆదర్శప్రాయమని వారు కొనియాడారు.

సంబంధిత పోస్ట్