విజ్ఞాన యాత్రలో పుల్లలచెరువు జెడ్పీ విద్యార్థులు

298చూసినవారు
విజ్ఞాన యాత్రలో పుల్లలచెరువు జెడ్పీ విద్యార్థులు
పుల్లలచెరువు జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు గురువారం మార్కాపురం ఇంజనీరింగ్ కళాశాల, గ్రంథాలయాన్ని సందర్శించారు. ఈ విహారయాత్రతో విద్యార్థులు విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు అవకాశం లభించిందని హెడ్ మాస్టర్ ప్రభూజీ అన్నారు. గ్రంథాలయంలో పలు విజ్ఞాన, చారిత్రక పుస్తకాలను చదువుకున్నారు. ఉపాధ్యాయులు ముద్దా. లక్ష్మీనారాయణ, కోటేశ్వరరావు తదితరులు ఈ విజ్ఞాన యాత్రల ద్వారా విద్యార్థులు జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్