మార్కాపురం జిల్లా దోర్నాల మండల కేంద్రంలో మంగళవారం రాత్రి పిచ్చి కుక్క దాడిలో కళ్యాణి, ధరణి అనే చిన్నారులు, రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి మౌలాలి సహా పలువురు గాయపడ్డారు. గాయపడిన వారికి మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్సలు అందించారు. ఈ సంఘటనతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.