దసరా ఉత్సవాల నేపథ్యంలో పెద్దదోర్నాల మండలం కొర్రపోలు పరిధిలో వన్యప్రాణుల వేట, మాంసం విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని అటవీశాఖ అధికారి కాజా రహమతుల్లా హెచ్చరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వన్యప్రాణి వేట నేరమని, జంతువులను వేటాడితే ఏడు నుంచి పదేళ్ల జైలుశిక్ష విధిస్తారని తెలిపారు. రాత్రిపూట పహారా బృందాలు పనిచేస్తున్నాయని మంగళవారం ఆయన వెల్లడించారు.