యర్రగొండపాలెం
టీడీపీ కార్యాలయంలో శనివారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
టీడీపీ ఇన్‌ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కొన్ని సమస్యలను అధికారులతో ఫోన్‌లోనే పరిష్కరించారు. మిగిలిన వినతులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ సుబ్బారావు, మండల అధ్యక్షుడు వెంగల్‌రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.