ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పుల్లలచెరువు మండల
టీడీపీ నాయకులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస, శాంతి, సేవా మార్గాలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పుల్లలచెరువు మండల
టీడీపీ పార్టీ అధ్యక్షులు పోట్ల గోవిందు, రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి కాకర్ల కోటయ్య, మాజీ మండల పార్టీ అధ్యక్షులు శనగ నారాయణరెడ్డి, క్లస్టర్ ఇన్చార్జి రెంటపల్లి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.