త్రిపురాంతకం వాసికి అక్షర కిరీటి బిరుదు ప్రధానం

3433చూసినవారు
త్రిపురాంతకం వాసికి అక్షర కిరీటి బిరుదు ప్రధానం
త్రిపురాంతకం మండలానికి చెందిన స్థానిక సాహితీవేత్త, అధ్యాపకులు గొట్టిముక్కుల నాసరయ్యకు అక్షర కిరీటి బిరుదును బుధవారం అందుకున్నారు. అంతర్జాతీయ సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవ సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో బుధవారం భద్రాచలంలోని పాల్ రాజ్ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన 176 జాతీయ ద్విశతాధిక కవి సమ్మేళనంలో పాల్గొని చక్కని కవితా గానం చేసిన నాసరయ్యకు అక్షర కిరీటి బిరుదుతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్ రాజ్ ఇంజనీరింగ్ కాలేజీ చైర్ పర్సన్ వి. వరలక్ష్మీ, శ్రీశ్రీ కళావేదిక జాతీయ అధ్యక్షురాలు జి. ఈశ్వరీభూషణం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్