మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బూరు గ్రామంలో ఆదివారం దొంగలు రెచ్చిపోయారు. పొలం ట్రాన్స్ఫార్మర్ల నుండి విద్యుత్ రాగి వైర్లను దొంగిలించారు. స్థానిక రైతులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వరస చోరీలు స్థానికంగా ఆందోళన కలిగిస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.