హత్య కేసులో మరో ముగ్గురు అరెస్ట్

558చూసినవారు
మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలంలో ఈ నెల 21న జరిగిన భర్త హత్య కేసులో పోలీసులు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. సూర్యనారాయణతో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య ఝాన్సీ, ఆమె తమ్ముడు అశోక్ కుమార్ కలిసి సూర్యనారాయణను కంట్లో కారంచల్లి, కత్తులతో హత్య చేశారు. ఇప్పటికే ఝాన్సీ, అశోక్ కుమార్లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. హత్యకు సహకరించిన రాజేష్, ఏసుబాబులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య కేసులో మరికొంతమంది హస్తం ఉందని, వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని సీఐ తెలిపారు. హత్యకు గురైన వ్యక్తి గంజాయి కేసులో నిందితుడు కాగా, భార్య బెయిల్ ఇప్పించి బయటకు తీసుకువచ్చి హత్య చేయించింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

సంబంధిత పోస్ట్