త్రిపురాంతకం మండలం గొల్లపల్లి జాతీయ రహదారిపై ఆదివారం మినీ లారీని ఏపీఎస్ఆర్టీసీ బస్సు వెనకనుంచి ఢీ కొట్టిన సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఆర్టీసీ బస్సు ముందు అద్దం పగిలిపోయింది. ప్రమాదం నుంచి బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మినీ లారీ అకస్మాత్తుగా బ్రేక్ వేయడం వల్ల ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లారీని వెనకనుంచి ఢీ కొట్టింది. బస్సు విజయవాడ నుండి జగ్గయ్యపేటకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.