రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలు

1543చూసినవారు
రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలు
మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలంలోని శ్రీనివాస నగర్ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం, ఆటో ఢీకొనడంతో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన మహిళను 108 అంబులెన్స్ ద్వారా యర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు చేపట్టగా, ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు.

సంబంధిత పోస్ట్