అక్రమ కేసులతో ఆపలేరు: మోదుగుల వేణుగోపాల్ రెడ్డి

1757చూసినవారు
గుంటూరు జిల్లాలో 30 యాక్ట్ అమల్లో ఉందని, జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పాల్గొనకూడదని తన నివాసంలో పోలీసులు నోటీసులు ఇచ్చారని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన దాడి బాధాకరమని, ఆయన కుటుంబం దాడులతో భయభ్రాంతులకు గురైందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అనుమతి లేదంటూ అక్రమ నోటీసులు ఇస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నిర్వీర్యమైందని, అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని, నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతోందని ఆరోపించారు. అన్నిటికీ సమాధానం చెప్పే రోజు వస్తుందని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్