Apr 17, 2026, 11:04 IST/
ఐసీసీ కొత్త టీ20 టోర్నీ: భారత్కు నో ఛాన్స్
Apr 17, 2026, 11:04 IST
మహిళల క్రికెట్ వ్యాప్తి కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) 'ఐసీసీ ఉమెన్స్ T20 ఛాలెంజ్' అనే కొత్త టోర్నమెంట్ను ప్రకటించింది. అసోసియేట్ దేశాలకు అంతర్జాతీయ స్థాయి ఎక్స్పోజర్ కల్పించడమే దీని లక్ష్యం. ఈ టోర్నీలో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా వంటి అగ్రశ్రేణి జట్లకు చోటు లేదు. రువాండాలోని కిగాలీలో ఏప్రిల్ 18 నుండి మే 2 వరకు జరిగే ఈ టోర్నీలో రువాండా, ఇటలీ, నేపాల్, అమెరికా, వనౌటు దేశాలు పాల్గొంటాయి.