రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు

4చూసినవారు
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం గుంటి గంగమ్మ ఆలయం వద్ద బుధవారం సిమెంటు లోడ్తో వెళ్తున్న లారీని వెనుక నుంచి వస్తున్న టిప్పర్ ఢీకొంది. గ్రీన్ ఫీల్డ్ హైవేకి మట్టి సరఫరా చేస్తున్న టిప్పర్ అదుపుతప్పి లారీని ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలవడంతో గంగవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం ఒంగోలుకు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్