తుఫాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన బూచేపల్లి

3చూసినవారు
తుఫాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన బూచేపల్లి
ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి గురువారం ముండ్లమూరు మండలంలో తుఫాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. పంట నష్టపోయిన రైతులతో మాట్లాడి, వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. తుఫాను సమయంలో సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్