ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో మంతా తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గురువారం ఒక రైతు తన పొలంలో నీటిపాలైన పంటను వీడియో ద్వారా చూపిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. చేతికి వచ్చిన పంట నష్టపోవడంతో రైతులు ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.