ముండ్లమూరు మండలం మారెళ్ళ వద్ద ఈదర వాగుపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. భారీ వర్షాల సమయంలో వాగు ఉధృతంగా ప్రవహించడం వల్ల నాలుగైదు రోజులు రాకపోకలు స్తంభించిపోతున్నాయని, అత్యవసర వైద్య సేవలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు తెలిపారు. మారెళ్ళ, జమ్మలమడక, మక్కెనవారి పాలెం, ఇతర గ్రామాల ప్రజలు ప్రయాణాలు ఆపుకోవాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు.