ప్రకాశం జిల్లా తాళ్లూరులో బుధవారం, స్థల వివాదంలో ఒక కుటుంబాన్ని కులం పేరుతో దూషించిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని దళిత సంఘాల ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలిపారు. బాధితుల కుటుంబానికి అండగా నిలబడిన దళిత సంఘాల నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.