వృద్ధురాలు మెడలలో నుంచి బంగారు గొలుసు చోరీ

3చూసినవారు
వృద్ధురాలు మెడలలో నుంచి బంగారు గొలుసు చోరీ
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోని పెద్ద ఉల్లగల్లు పంచాయతీ లక్ష్మీ నగర్ లో దొంగలు రెచ్చిపోయారు. ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న ఓ వృద్ధురాలి మెడలో నుంచి గుర్తుతెలియని వ్యక్తులు బంగారు గొలుసును చోరీ చేసి పరారయ్యారు. వృద్ధురాలు కేకలు వేసినా దొంగలు తప్పించుకున్నారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ హనుమంతరావు శనివారం తెలిపారు.

ట్యాగ్స్ :