దర్శి
టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, మహానాడు పండుగను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దర్శిలో జరిగిన మహానాడు సన్నాహక సమావేశంలో నియోజకవర్గ పరిశీలకులు రాఘవేంద్ర, యువనేత కడియాల లలిత్ సాగర్, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. వర్చువల్ మహానాడు ప్రతి కార్యకర్త భాగస్వామ్యానికి ఉపయోగపడుతుందని, ఇది క్లస్టర్ల బలోపేతానికి దోహదపడుతుందని ఆమె తెలిపారు.