ప్రకాశం జిల్లా దర్శి మండలం తిమ్మాయపాలెం గ్రామంలో, జులాయి తిరుగుతున్నాడని కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు అతన్ని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.