ఇంటి దొంగను పట్టిన పోలీసులు

3చూసినవారు
ఇంటి దొంగను పట్టిన పోలీసులు
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం సుంకరవారి పాలెం గ్రామంలో సొంత బంధువు ఇంట్లోనే దొంగతనానికి పాల్పడిన ఘటనలో, ముండ్లమూరు పోలీసులు బావమరిది ఆరవీటి కోటేశ్వరరావును అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి సుమారు రూ. 10,000 విలువైన వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ కమలాకర్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితుడిని కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్