అర్ధరాత్రి పెట్రోల్ డీజిల్ కోసం పడిగాపులు

4చూసినవారు
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం అర్ధరాత్రి నుంచి పెట్రోల్ బంకుల వద్ద వాహనాల క్యూలు కనిపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని, కొరత ఏర్పడుతుందని సోషల్ మీడియాలో ప్రచారాలు జరగడంతో, పెట్రోల్ బంక్ నిర్వాహకులు ఉద్దేశపూర్వకంగా 'నో స్టాక్' బోర్డులు పెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్