విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: రాజాబాబు

864చూసినవారు
జిల్లా కలెక్టర్ రాజబాబు, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. సంక్షేమ పథకాల అమలులో డబ్బులు డిమాండ్ చేయడం లేదా తీసుకోవడం వంటివి చేస్తే సహించేది లేదని, అటువంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. మండల స్థాయి అధికారులు తమ పరిధిలో పూర్తి పట్టు సాధించాలని ఆయన తెలిపారు.