ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో సోమవారం వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. తాళ్లూరు మండలం కొత్తపాలెం వద్ద ప్రైవేటు పాఠశాల బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. దర్శి మండలం తూర్పు వెంకటాపురం సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ప్రమాదాలపై దర్యాప్తు చేస్తున్నారు.