ప్రకాశం జిల్లా దర్శి మండలం వెంకటాచలం సమీపంలో పొగాకు పనులకు కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మహిళా కూలీలకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో సుమారు 15 మంది మహిళా కూలీలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎవరికీ తీవ్ర గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.