దర్శి మండలంలోని బొట్లపాలెం గ్రామంలో సోమవారం రాత్రి టీడీపీ కార్యకర్తలపై వైసీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన ఇద్దరికి గాయాలయ్యాయి. ఆదివారం జరిగిన శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి తిరునాళ్ల సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభల విషయంలో సోమవారం రాత్రి రెస్టారెంట్‌లో మాట్లాడుకుంటుండగా ఘర్షణ చెలరేగినట్లు తెలుస్తోంది. టీడీపీ కార్యకర్తల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.