
మంత్రి పుట్టినరోజు సందర్భంగా పలు కార్యక్రమాలు
ప్రకాశం జిల్లా దర్శి టిడిపి ఇన్ చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, ఐటి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు. పలు గ్రామాలలో అభిమానులు ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో పాల్గొని, నియోజకవర్గంలో 7.06 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎటువంటి హంగామా లేకుండా అభివృద్ధి దిశగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు.



































