
మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవు
కంభం పట్టణంలో ఆదివారం సీఐ మల్లికార్జున వాహనదారులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైతే, వాహనం నడిపిన మైనర్‌తో పాటు వాహనం ఇచ్చిన యజమాని కూడా నేరస్తులుగా పరిగణించబడతారని, కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు దగ్గర ఉంచుకోవాలని సూచించారు.








































