
మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున సాయం: మంత్రి లోకేష్
AP: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.15 లక్షలు, గాయపడిన వారికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఘటనాస్థలిని పరిశీలించిన అనంతరం పలాస ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. “వృద్ధుడు సొంత ఖర్చుతో ఆలయం నిర్మించగా, భారీ రద్దీ కారణంగా ప్రమాదం జరిగింది. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.




