ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో 2018లో భీమవరపు చిరంజీవిపై కణాల వెంకటయ్య కర్రతో దాడి చేశాడు. ఈ కేసులో గిద్దలూరు కోర్టు నిందితుడు వెంకటయ్య నేరం చేశాడని నిర్ధారించింది. న్యాయమూర్తి భరత్ చంద్ర, వెంకటయ్యకు రోజంతా కోర్టులో నిలబడాలని, రూ. 5000 జరిమానా విధించారు. వెంకటయ్య వయసు, అనారోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని శిక్షను కొంత తగ్గించినట్లు న్యాయమూర్తి తెలిపారు.