ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పిట్టికాయగుళ్ల గ్రామంలో నిన్న ఓ వర్గం పోలేరమ్మ గ్రామోత్సవం నిర్వహిస్తుండగా మరో వర్గం అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగి, ఇరు వర్గాల వారితో మాట్లాడి శాంతింపజేశారు. మార్కాపురం సబ్ కలెక్టర్, తహసిల్దార్, డీఎస్పీ నాగరాజు, సీఐ మల్లికార్జున, బేస్తవారిపేట ఎస్ఐలు కలిసి ఇరు వర్గాల వారితో చర్చించి, గతంలో మాదిరిగా కలిసిమెలిసి ఉండాలని సూచించడంతో వివాదం ముగిసింది.