2వ అదనపు జూనియర్ న్యాయస్థానానికి జడ్జిగా భరత్ చంద్ర

1చూసినవారు
2వ అదనపు జూనియర్ న్యాయస్థానానికి జడ్జిగా భరత్ చంద్ర
మార్కాపురం జిల్లా గిద్దలూరులో ఆదివారం రెండవ అదనపు జూనియర్ సివిల్ న్యాయస్థానాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయ సునీత, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజ్యలక్ష్మి హాజరయ్యారు. 2వ జూనియర్ సివిల్ న్యాయస్థానానికి ఇన్ ఛార్జ్ గా జూనియర్ సివిల్ జడ్జి భరత్ చంద్ర బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికే ఆయన 1వ జూనియర్ సివిల్ న్యాయస్థానానికి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. కార్యక్రమం అనంతరం న్యాయవాదులు భరత్ చంద్రకు శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్