గిద్దలూరు మండలం కంచిపల్లి గ్రామంలో విష ప్రయోగం వల్లే తమ గేదెలు చనిపోయాయని రైతు గురవయ్య ఆరోపించారు. శుక్రవారం ఉదయం పశువులకు నీళ్లు పెట్టిన అనంతరం గేదెలు అనారోగ్యానికి గురయ్యాయి. వైద్యులు చికిత్స అందిస్తుండగా మూడు గేదెలు మృతి చెందాయి, మరొకటి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు వేడుకుంటున్నాడు.