కంభంలో కారు అదుపుతప్పి బోల్తా

2239చూసినవారు
ప్రకాశం జిల్లా కంభం పట్టణ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఆదివారం ఓ కారు అదుపుతప్పి బోల్తాపడ్డ సంఘటన చోటుచేసుకుంది. ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. గాయపడ్డ వారిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను ఒంగోలుకు తరలించారు. క్షతగాత్రులు అందరూ కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించారు.

సంబంధిత పోస్ట్