ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అర్ధవీడు మండలం మాజీ ఎంపీపీ రాజేశ్వర్ రెడ్డి తనకు ఎదురవుతున్న వేధింపులపై ఫిర్యాదు చేశారు. కొద్దిరోజుల క్రితం తన ఇంటి ఆవరణలో ఉన్న తన కారును తగలబెట్టారు. గతంలో తన పొలాన్ని తగలబెట్టారని గిద్దలూరు వైసిపి నాయకులు ఏపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ ప్రవీణ్ కుమార్ రెడ్డితో కలిసి మాజీ సీఎంకు సమస్యని విన్నవించాడు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని మాజీ సీఎం రాజేశ్వర్ రెడ్డికి భరోసా ఇచ్చారు.