మార్కాపురం జిల్లా కొమరోలు మండలం కత్తులవానిపల్లి గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య, ఎస్సై నాగరాజు, పోలీసు సిబ్బందితో కలిసి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని, 8 వాహనాలకు జరిమానా విధించారు. గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించారు. దొంగతనాలు జరగకుండా జాగ్రత్తలు వివరించి, అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ రామకోటయ్య గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.