రాచర్ల మండలంలో పత్తి పంట నష్టం

3చూసినవారు
ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో మంతా తుఫాన్ కారణంగా నష్టపోయిన పత్తి పొలాలను గురువారం వ్యవసాయ అధికారి షేక్ మహబూబ్ బాషా పరిశీలించారు. అనుములపల్లి, రాచర్ల, గంగంపల్లి, అనుముల వీడు, రామాపురం, సోమిదేవుపల్లి, వదుల వాగుపల్లి గ్రామాలలో పత్తి కాయ దశలో ఉండటంతో అధిక నష్టం వాటిల్లింది. సుమారు 625 హెక్టార్ల పత్తి, 40 హెక్టార్ల కంది, 14 హెక్టార్ల వరి నష్టపోయినట్లు ప్రాథమిక అంచనా. రైతు సేవ కేంద్రం సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి, మూడు రోజులలోగా నష్టపోయిన జాబితాను జిల్లాకు పంపనున్నారు.

ట్యాగ్స్ :