గిద్దలూరు మండలంలోని బురుజుపల్లిలో ఇటీవల ఈదురు గాలులతో కురిసిన వర్షానికి నష్టపోయిన అరటి పంటను ఉద్యానశాఖ అధికారి శ్వేత గురువారం పరిశీలించారు. గిద్దలూరు, రాచర్ల మండలాలలో కలిపి 30 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని, దీనికి సంబంధించిన ప్రాథమిక అంచనాలు ప్రభుత్వానికి సమర్పించామని తెలిపారు. క్షేత్ర పరిశీలన చేసి తుది నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని అధికారి శ్వేత పేర్కొన్నారు.