ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో మంతా తుఫాను కారణంగా అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పామూరు పల్లి గ్రామంలో 60 ఎకరాలకు పైగా అరటిపంట ధ్వంసం అయిందని రైతులు తెలిపారు. ఎకరాకు లక్షకు పైగా పెట్టుబడి పెట్టిన తమకు గతంలోనూ పంట నష్టపోయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అరటి రైతులకు అండగా నిలవాలని రైతులు కోరుతున్నారు.