శుక్రవారం మార్కాపురం జిల్లా బేస్తవారిపేట బీసీ కాలనీలో జరిగిన హత్య ఘటనపై డీఎస్పీ టీఎస్పీ నాగరాజు మీడియాకు వివరాలు వెల్లడించారు. జయంపు కృష్ణయ్య, అతని స్నేహితుడు చిన్న రంగయ్య మూడు నెలలుగా ఒకే ఇంట్లో ఉంటున్నారని, హత్య అనంతరం చిన్న రంగయ్య అదృశ్యమైనట్లు డీఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.