నల్లమలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శనివారం ఆత్మకూరు (మం) బైర్లుటి వద్ద సిద్దాపురం చెరువు అలుగుపారడంతో దోర్నాల-ఆత్మకూరు రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఆత్మకూరు, నంద్యాల, కర్నూలు వైపు వెళ్లే వాహనాలను పోలీసులు దోర్నాలలో నిలిపివేసి, దేవరాజుగట్టు, కంభం, గిద్దలూరు మీదుగా దారి మళ్ళిస్తున్నట్లు తెలిపారు.