రంగనాయక స్వామి ఆలయానికి భారీగా తరలివచ్చిన భక్తులు

6చూసినవారు
మార్కాపురం జిల్లా రాచర్ల మండలంలోని నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. సెలవు దినం కావడంతో జిల్లా నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఆలయ పాలకమండలి చైర్మన్ సిద్ధం నరసింహులు ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు, రంగనాయక స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి దర్శనం కోసం భక్తులకు రెండు నుంచి మూడు గంటల వరకు సమయం పట్టినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్