డ్రైవర్, క్లీనర్ మధ్య వివాదం బస్సును తగలబెట్టిన క్లీనర్

3చూసినవారు
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పాపినేని పల్లి గ్రామంలో మంగళవారం డ్రైవర్ నబి, క్లీనర్ గోపాల్ మధ్య జరిగిన వివాదంలో క్లీనర్ గోపాల్ పెట్రోల్ పోసి బస్సులు తగలబెట్టాడు. ఈ ఘటనలో డ్రైవర్ నబి తీవ్రంగా గాయపడటంతో అతన్ని అర్ధవీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పెట్రోల్ పోసి తగలబెట్టిన అనంతరం గోపాల్ పరారయ్యాడు. కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య విధులు నిర్వహణపై వాగ్వాదం జరుగుతోందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో స్కూల్ బస్సు పూర్తిగా కాలిపోయింది.

ట్యాగ్స్ :