కంభం ఎయిడెడ్ పాఠశాలలో ద్వంద విధానం: ఎంఈవో ఆకస్మిక తనిఖీ

5చూసినవారు
కంభం మండలంలోని రంగరాజు ఎయిడెడ్ పాఠశాలలో బుధవారం ఎంఈవో అబ్దుల్ సత్తార్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఒకే తరగతి గదిలో విద్యార్థులు వేర్వేరు యూనిఫాంలు ధరించడం, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ విద్యార్థులను ఒకే తరగతిలో ఉంచి ద్వంద విధానాలను అమలు చేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనాన్ని కూడా ప్రైవేట్ విద్యార్థులకు అందిస్తున్నట్లు గుర్తించారు. తదుపరి సందర్శనలో సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఎంఈవో తెలిపారు.

ట్యాగ్స్ :