గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గురువారం గిద్దలూరులో జరిగిన మహానాడు కార్యక్రమంలో మాట్లాడుతూ, సొంత బాబాయిని గొడ్డలితో ఎవరు వేసేసారో అందరికీ తెలుసా అని ప్రశ్నించారు. స్వర్గీయ
ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఆదర్శంగా తీసుకొని సీఎం చంద్రబాబు సంక్షేమంతో పాటు అభివృద్ధిని రాష్ట్రంలో అమలుపరుస్తున్నారని ప్రశంసించారు. ఓర్వలేని వైసిపి తమని వెన్నుపోటు పార్టీ అని అంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.