మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో పొగాకు రైతులు 2 సంవత్సరాల పాటు పొగాకు సాగును నిలిపివేయాలని నిర్ణయించారు. బుధవారం పట్టణంలోని తిరుమల కన్వర్షన్ హాల్లో జరిగిన రైతు సంఘాల సమాఖ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. డిమాండ్‌కు మించి పొగాకు సాగు చేయడం వల్ల గిట్టుబాటు ధర లభించడం లేదని రైతులు అభిప్రాయపడ్డారు. అవసరమైతే క్రాప్ హాలిడే పాటించాలని తీర్మానించారు.